ఇటీవల ‘యానిమాల్’తో బాక్సాఫీసు వద్ద భారీ విజయాన్ని అందుకుంది. రష్మిక సినీరంగంలోకి అడుగుపెట్టి ఏడేళ్లను విజయవంతంగా పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా తన సంతోషాన్ని అభిమానులతో పంచుకుంది. ”నా ఈ సినీప్రయాణంలో కొన్నిసార్లు వెనక్కితిరిగి చూసుకుంటే.. ఇదంతా ఎలా, ఎప్పుడు, ఎందుకు జరిగిందనిపిస్తోంది. సినిమా రంగంలోకి రావడం ఆనందంగా, గర్వంగా ఉంది.
ఈ జీవితం కోసమే ఎన్నో కలలు కన్నాను. మంచి జీవితం కోసం పరుగులు తీస్తూనే ఉన్నాను. కానీ, సరైన వ్యక్తులు తోడుగా ఉండటం వల్ల ఆలోచించి అడుగులు వేయగలుగుతున్నాను. కలలుకంటూ పెరిగిన నేను సంతోషంగా, ప్రశాంతంగా ఉన్నాను. ఇలా లిటిల్ గర్ల్ తన కలల కోసం ఎదిగింది” అంటూ ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం’పుష్ప2’, ‘ది గర్ల్‌ఫ్రెండ్’, ‘ఛావా’, ‘రెయిన్‌బో’ చిత్రాల్లో నటిస్తోంది రష్మిక..!!