in

Rashmika comments On Vijay Devarakonda’s mother goes viral!

వీరిద్దరూ ఒకే ఇంట్లో ఉన్నారని జనాలు కూడా ఫిక్స్ అయ్యారు. మొన్నటికి మొన్న రష్మిక యానిమల్ ప్రమోషన్స్ కోసం బాలయ్య అన్ స్టాపబుల్ షోకు రావడం, అందులో విజయ్ ఫోన్ కాల్, రష్మిక మాటలు, రణ్ బీర్ కపూర్ లీక్ చేసిన విషయాలతో అందరికీ మరోసారి బలమైన అభిప్రాయం కూడా ఏర్పడింది. ఈ ఇద్దరూ నిజంగానే ప్రేమలో ఉన్నారని అంతా అనుకోవడానికి ఈ ఎపిసోడ్ మరింత బలం చేకూర్చింది. ఇదిలా వుండగా తాజాగా రష్మిక మాట్లాడిన మాటలు, విజయ్ దేవరకొండ తల్లి గురించి చెప్పిన మాటలు వింటే మాత్రం ఇక ఆ ఇంటికి ఈమె కోడలిగా కన్ఫామ్ అయినట్టుగానే కనిపిస్తోంది.

యానిమల్ ప్రమోషన్స్ కోసం రష్మిక ఓ సింగింగ్ షోకు వెళ్లింది. అక్కడ ఓ దివ్యాంగురాలైన గాయనిని రష్మిక మెచ్చుకోవడం తో పాటూ ఈ గాయని అంటే మాధవి దేవరకొండకి సైతం చాలా ఇష్టమట.అదే విషయాన్ని రష్మిక చెబుతూ..మా ఇంటి నుంచి ఈ విషెస్ వచ్చాయి..మాధవి ఆంటీ..నాకు సెకండ్ మదర్ లాంటి వారు..ఆమెకు కూడా నువ్వంటే చాలా ఇష్టమని ఆ గాయనికి చెప్పింది రష్మిక. ఇకపోతే విజయ్ తల్లి..తనకు కూడా తల్లి లాంటిదే అని రష్మిక చెప్పడంతో దేవరకొండ ఇంటికి కోడలిగా ఫిక్స్ అయినట్టుందే? అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు..!!

Aadikeshava!

Ileana recalls her feelings during pregnancy times!