తాజాగా ఈ డీప్ ఫేక్ వీడియోపై హీరోయిన్ రష్మిక మందన్న కూడా స్పందించింది. టెక్నాలజీని ఎంత దుర్వినియోగం చేస్తున్నాతో తలుచుకుంటేనే నిజంగా భయంగా ఉందని పేర్కొంది. ఈ మేరకు ట్వీట్ చేసిన రష్మిక మందన్న.. ఇలాంటి వీడియో గురించి మాట్లాడాలంటే చాలా బాధగా ఉందని చెప్పింది. ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోన్న తన డీప్‌ఫేక్ వీడియో గురించి మాట్లాడాల్సి వస్తోందని..
ఇలాంటివి తనకే కాదు..టెక్నాలజీ దుర్వినియోగం అవుతోన్న క్రమంలో ప్రతి ఒక్కరికీ చాలా భయంగా ఉంటుందని అన్నారు. ఇవాళ తాను ఒక మహిళగా..నటిగా మాట్లాడుతున్నా అంటూ చెప్పుకొచ్చారు. ఒకవేళ ఇదే తాను స్కూల్, కాలేజీలో ఉన్నప్పుడు జరిగి ఉంటే..ఎలా తట్టుకోగలనో ఊహకు కూడా అందడం లేదన్నారు. అయితే.. ప్రస్తుతం తనకు మద్దతుగా ఉన్న తన కుటుంబం, స్నేహితులు, శ్రేయోభిలాషులకు రష్మిక కృతజ్ఞతలు తెలిపారు..!!