తాను కాలేజ్లో చదువుతున్న సమయంలో ఒక అందాల పోటీలో టైటిల్ గెలుచుకున్నానని రష్మిక వివరించారు. ఆ సమయంలోనే వార్తాపత్రికలో వచ్చిన తన ఫొటోను చూసి ఒక నిర్మాణ సంస్థ తనను సంప్రదించిందన్నారు. అప్పుడు తాను ఆశ్చర్యపోయానని తెలిపారు. “ఓ నిర్మాణ సంస్థ సినిమా ఆఫర్ ఇచ్చేందుకు ఫోన్ చేస్తే ప్రాంక్ కాల్ అనుకున్నాను. నాకు నటనపై ఆసక్తి లేదని చెప్పాను. నా చదువును కొనసాగించాలనుకుంటున్నానని చెప్పాను. నేను రామయ్యలో చదువుతున్నానని తెలుసుకున్నారు..
దీంతో నిర్మాణ సంస్థ టీచర్స్ ద్వారా నన్ను సంప్రదించారు. మా టీచర్స్ నీకు సినిమా ఆఫర్ వచ్చింది. వెళ్లమని చెప్పారు ” అని రష్మిక వెల్లడించారు. అలాగే తొలి సినిమా కోసం కెమెరాల ముందు ఆడిషన్ ఇవ్వడానికి కూడా రష్మిక భయపడిందట. ఇదే విషయాన్ని నేషనల్ క్రష్ ఇంటర్వ్యూలో చెప్పారు. తనకు కెమెరా ముందు ఆడిషన్ ఇవ్వడం అంత సౌకర్యంగా అనిపించలేదన్నారు. ముఖ్యంగా ఎవరైనా పక్క నుంచి సూచనలు ఇచ్చినప్పుడు నటించడం చాలా కష్టమైందని తెలిపారు. ” నేను ఆడిషన్లు ఇవ్వలేనని నాకు అనిపించింది. నేను కెమెరా ముందు ఫ్రీగా ఉండలేను. ఆడిషన్ గదిలో వేరొకరు డైలాగ్లు చెబుతుండడంతో కెమెరా ముందు చాలా ఇబ్బందిపడ్డాను..!!