కల్యాణ్ గారితో ‘గోకులంలో సీత’ సినిమా చేశాను. అప్పట్లో ఆయన పెద్దగా మాట్లాడేవారు కాదు. మా పాప ఫస్టు బర్త్ డేకి ఇన్వైట్ చేయడానికి వెళితే, ఎంతో ఆప్యాయంగా పలకరించారు. ఆయన అంతలా మాట్లాడతారని నేను ఊహించలేదు. ‘గోకులంలో సీత 2’ తీస్తే ఆయనతో చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అదే మాట సరదాగా ఆయనతో అన్నాను కూడా. ఆ సినిమా నా కెరియర్లో చెప్పుకోదగిన సినిమాలో ఒకటిగా నిలిచిపోయింది” అని చెప్పారు.
“చరణ్ సినిమా ‘రంగస్థలం’లో ‘రంగమ్మత్త’ పాత్ర కోసం ముందుగా నన్ను అడిగారు. ఆ పాత్రను గురించి నాకు చెప్పారు. నాకున్న ఇమేజ్ కి కొన్ని సీన్స్ ఇబ్బందిగా అనిపిస్తాయని అన్నాను. పైగా నా ఫేస్ ఆ పాత్రకి తగినట్టుగా ఉండదేమోనని అనిపించింది. అదే మాట వాళ్లతో చెప్పాను. ఆ తరువాత ఆ పాత్రను అనసూయ చేసింది. ఆ పాత్రకి తను కరెక్టుగా సరిపోయింది..చాలా బాగా చేసింది కూడా” అని అన్నారు.!!