సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా జంటగా నటించిన తాజా చిత్రం ‘తెలుసు కదా’. ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా చిత్రబృందం వరుస ఇంటర్వ్యూలు ఇస్తోంది. ఈ క్రమంలో ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న రాశీ ఖన్నా, హీరో సిద్ధు గురించి మాట్లాడుతూ.. అతని కాన్ఫిడెన్స్ చూసి తానొక ‘పిచ్చి ము*డ’లా చూస్తూ ఉండిపోయానని వ్యాఖ్యానించారు. ఈ వీడియో క్లిప్ క్షణాల్లో వైరల్ అవ్వడంతో, నెటిజన్లు ఆమెపై విమర్శలు గుప్పించారు.
ఈ వివాదంపై రాశీ ఖన్నా స్పందిస్తూ, ‘‘నిజంగా అది ఒక బూతు పదమని నాకు తెలియదు. నేను దాన్ని ఓ అందమైన, క్యూట్ వర్డ్ అనుకున్నాను. అందుకే అలా అనేశాను. తర్వాత నా స్నేహితురాలు ఫోన్ చేసి దాని అసలు అర్థం చెప్పింది’’ అని చెప్పుకొచ్చారు. ఆమెకు మద్దతుగా హీరో సిద్ధు జొన్నలగడ్డ కూడా మాట్లాడారు. తమ సినిమాలో ఒక బామ్మ పాత్ర ఈ పదాన్ని వాడుతుందని, రాశీకి దాని అసలు అర్థం తెలియదని, క్యూట్ వర్డ్ అనే భ్రమలోనే ఆమె మాట్లాడిందని ఆయన తెలిపారు..!!