ప్రముఖ నటి రాశి ఖన్నా దక్షిణాది, ఉత్తరాది సినీ పరిశ్రమల పనితీరుపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. తన కొత్త చిత్రం ‘తెలుసు కదా’ ప్రమోషన్లలో భాగంగా మాట్లాడిన ఆమె, తెలుగు చిత్ర పరిశ్రమ పని వాతావరణాన్ని ప్రశంసిస్తూ, బాలీవుడ్‌పై కొన్ని ఆసక్తికరమైన అభిప్రాయాలను పంచుకున్నారు.
పని గంటల విషయంలో తెలుగు పరిశ్రమ ఎంతో మెరుగ్గా ఉంటుందని రాశి ఖన్నా తెలిపారు. “తెలుగులో రోజుకు సగటున 9 గంటలు మాత్రమే షూటింగ్ ఉంటుంది. కానీ, తమిళ, హిందీ పరిశ్రమల్లో 12 గంటల సుదీర్ఘ షిఫ్టుల వల్ల నటీనటులు ఎక్కువగా అలసిపోతారు” అని ఆమె వివరించారు. ఈ తేడా పనితీరుపై గణనీయమైన ప్రభావం చూపుతుందని ఆమె పేర్కొన్నారు. అంతేకాకుండా, నటీనటుల ప్రవర్తనలో కూడా దక్షిణాది, ఉత్తరాది పరిశ్రమల మధ్య స్పష్టమైన తేడా కనిపిస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు..!!