తన గురువు, మార్గదర్శి అయిన దుక్కిపాటి మధుసూదన్ రావు గారి మాటకు ఎదురు చెప్పిన అక్కినేని నాగేశ్వర రావు గారు. అన్నపూర్ణ పిక్చర్స్ వారు , యద్దనపూడి సులోచన రాణి నవలను ” విచిత్ర బంధం” అనే పేరుతో సినిమా నిర్మిస్తున్నారు. అప్పటికే నవల నాయకుడిగా పేరు ఉన్న అక్క్కినేని హీరో పాత్ర, వాణిశ్రీ హీరోయిన్ పాత్ర పోషిస్తున్నారు. నవలలో ప్రకారం హీరో, హీరోయిన్ ని రేప్ చేయాలి ఆ సన్నివేశం విన్న అక్కినేని గారు, హీరో, హీరోయిన్ ని రేప్ చేయటం ఏమిటండి, ప్రేక్షకులు చూస్తారా, ఇటువంటి మనం తీస్తే, నేను నటించను గాక నటించను అని డైరెక్టర్ ఆదుర్తి సుబ్బా రావు తో చెప్పేశారట.
అక్కినేని గారి కమిట్మెంట్ గురించి తెలిసిన సుబ్బా రావు గారు చేసేది ఏమిలేక, నిర్మాత అయిన దుక్కిపాటి వారికీ విషయం చెప్పారట. దుక్కిపాటి గారు కథానుగుణంగా కొన్ని సన్నివేశాలు మనకు ఇష్టం ఉన్న లేక పోయిన నటించాలి, నువ్వు ఈ టైం లో నటించను అని మొండికి వేస్తె ఎలా అని అక్కినేని గారిని మెల్లగా కన్వెన్స్ చేసారు. ఏమో నాకయితే ఇష్టం లేదు, మీ మాట కాదనలేక నటిస్తున్నాను అని అయిష్టంగానే ఆ సీన్ లో నటించారట, ఆ సీన్ పిక్చర్ కి టర్నింగ్ పాయింట్ అయింది, సినిమా సూపర్ హిట్ అయింది..