in

Rani Mukerji and Chiranjeevi to star together?

మెగాస్టార్ చిరంజీవి జోరు పెంచారు. వరుస సినిమాలను లైన్ లో పెట్టారు. ప్రస్తుతం ‘విశ్వంభర’ సినిమాతో ఆయన బిజీగా ఉన్నారు. మరోవైపు ‘దసరా’ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో చిరంజీవి ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. ఒకప్పడు తన అందచందాలతో బాలీవుడ్ ను ఊపేసిన రాణీ ముఖర్జీ ఈ సినిమాలో నటిస్తున్నట్టు సమాచారం.

ఈ సినిమాకు హీరో నాని సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో చిరంజీవి సరసన నటించే హీరోయిన్ పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉంటుందట. ఆ పాత్రకు రాణీ ముఖర్జీ అయితే బాగుంటుందని శ్రీకాంత్ ఓదెల చెప్పగా…చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. ఇదే వార్త బాలీవుడ్ సర్కిల్స్ లో కూడా ట్రెండ్ అవుతోంది..!!

Alia Bhatt becomes World’s 2nd most influential actor on Instagram!