టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఎన్నోఏండ్లుగా తన ప్రేమాయణంపై వస్తున్న పుకార్లకు పుల్‌స్టాప్ పెట్టాడు. సోషల్‌మీడియా ద్వారా రానా తను వివాహం చేసుకోబోయే అమ్మాయిని పరిచయం చేశాడు. తన ప్రేమను మిహికా బజాజ్ అంగీకరించిందని చెప్పాడు. ఈ సందర్భంగా తన ప్రేయసితో ఉన్న ఫొటోను రానా అభిమానులతో పంచుకున్నాడు. చాలా రోజుల నుంచి ఆమెతో రానా ప్రేమ ప్రయాణం సాగిస్తున్నట్లు తెలిసింది. సహచర నటీనటులు, డైరెక్టర్లు, సన్నిహితులు, అభిమానులు రానాకు కంగ్రాట్స్ చెబుతున్నారు.