ఏన్నాడు లేని విధంగా తెలుగు చిత్ర సీమలో మల్టీస్టారర్ మూవీస్ కు ప్రాధాన్యత పెరిగింది. ప్రేక్షకుల నుంచి కూడా మంచి ఆదరణ లభిస్తుండటంతో దర్శకనిర్మాతలు మల్టీస్టారర్ సినిమాలను తీయడానికి మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్లో మరో మల్టీస్టారర్ మూవీ కోసం రంగం సిద్ధమవుతున్నారట టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి. ఇప్పటికే ..ఓ వెబ్ సిరీస్ కోసం రానా తన బాబాయ్ వెంకటేష్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. ఈ రెండు ప్రాజెక్టు పూర్తి అయిన తరువాత మరో యంగ్ హీరోతో కూడా స్క్రీన్ ని షేర్ చేసుకోవడానికి సిద్దమయ్యారు రానా.
ఆ హీరో ఎవరో కాదంట.. మరో టాలెంటెడ్ హీరో శర్వానంద్. గత వారంరోజులుగా రానా, శర్వాల కాంబినేషన్ లో క్రేజీ మల్టీస్టారర్ మూవీ తెరకెక్కనున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్నది. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ సినిమాను ప్రారంభించి అతి త్వరలో ఫినిష్ చేయాలనేది ప్లాన్. ఈ మేరకు ఇప్పటికే రానా, శర్వాలతో సంప్రదింపులు కూడా పూర్తయ్యాయని, చిత్ర దర్శకుడు, ఇతర వివరాలపై త్వరలోనే ఓ క్లారిటీ రానుందని అంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందట.