in

rana daggubati in mahesh babu film?

ఛాలెంజింగ్ రోల్స్ కి రానా కేరాఫ్ అడ్రస్ అయ్యాడు. భళ్ళాల దేవ పాత్ర రానాని పాన్ ఇండియా హీరోని చేసింది. హీరోతో సమానంగా పాపులారిటీ తెచ్చుకున్నాడు. ఇంకెవరు చేసినా ఆ పాత్రకి అంత గుర్తింపు వచ్చి ఉండేది కాదు. తాజాగా రజనీ కాంత్ నటించిన ‘వేట్టయన్’ మూవీలో కూడా రానా నెగిటీవ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించాడు. ఉన్నది కాసేపు అయినా చాలా ఎఫెక్టీవ్ గా ఉంది రానా పెర్మార్మెన్స్. మరో సారి రానా విలన్ గా ఫుల్ మార్క్స్ కొట్టేసాడు. హీరో కంటే ఇలాంటి పాత్రలే బెటర్ అనిపిస్తుంది.

రాజా మౌళి కూడా ఇలాగే ఆలోచించారేమో అందుకే జక్కన్న ఓటు రానాకే వేసారని ఫిలిం నగర్ టాక్. దేనికి ఓటు అనుకుంటున్నారా? జక్కన్న మహేష్ తో తీయబోయే సినిమాలో  రానాని విలన్ గా ఎంచుకున్నట్లు టాక్. ఈ మూవీలో రానా ఆఫ్రికాలోని మ‌సాయి తెగ‌కు చెందిన నాయకుడిగా క‌నిపించ‌నున్నాడ‌ట. SSMB 29 లో విలన్ గా పలువురు పేర్లు వినిపించాయి. హృతిక్ రోషన్, బాలీవుడ్, హాలీవుడ్ వరకు చాల పేర్లు వినిపించినా చివరికి టాలీవుడ్ హీరో రానా కన్ఫర్మ్ అయ్యాడు. రానా పాత్ర చాలా కర్క‌శంగా ఉండ‌నుందని టాక్..!!

Vettaiyan Over all Reviews!

Alia Bhatt reveals she has Attention Deficit Hyperactivity Disorder (ADHD)!