in

Rana Daggubati announces an Interesting Project with nivetha thomas!

నివేదా థామస్‌ పెళ్లి చేసుకోనున్నారంటూ రెండు రోజులుగా నెట్టింట గాసిప్పులు హల్‌చల్‌ చేస్తున్నాయి. ఇప్పుడు ఆ వార్తలు చెక్‌ పెట్టారు నివేదా. కొత్త చిత్రాన్ని ప్రకటించి రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చారు. ఇటీవల తన ఇన్‌స్టా స్టోరీలో ‘ఎన్నో రోజుల తర్వాత..ఫైనల్లీ’ అని రాశారు. దీనికి లవ్‌ సింబల్‌ను జోడించారు. దీంతో ఈ హీరోయిన్‌ పెళ్లి పీటలెక్కనుందని జోరుగా ప్రచారం జరిగింది..

తాజాగా ఆ రూమర్స్‌కు చెక్‌ పెడుతూ ‘చాలా రోజులు వేచి చూశారు. ఇది నా స్పెషల్‌ ఫిల్మ్‌’ అని కొత్త సినిమా విశేషాలు చెప్పారు. దీంతో ఆమె పెట్టిన స్టేటస్‌ పెళ్లి గురించి కాదని.. కొత్త సినిమా గురించేనని క్లారిటీ వచ్చింది. ‘35 – చిన్న కథ కాదు’ అనే టైటిల్‌తో ఈ చిత్రం తెరకెక్కనుంది. నటుడు రానా దగ్గుబాటి ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.

Rumored ex-girlfriend Tabu’s comment on Nagarjuna’s photo!

Samantha to team up with Shah Rukh Khan?