in

‘RAMARAJU FOR BHEEM’ TO COME ON THIS DAY?

ర్శకదీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్.ఆర్.ఆర్ చిత్రం నుంచి మోషన్ పోస్టర్ ని వదిలి అందరి మనలో ఆశలు కలిగించాడు. ఈ మోషన్ పోస్టర్ అందరికీ తెగ నచ్చింది. నీరు నీప్పు కాన్సెప్ట్ తో ఉన్న ఈ పోస్టర్ చాలా కొత్తగా అనిపించింది. మోషన్ పోస్టర్ ఇచ్చిన ఆనందం ఇంకా ఉండగానే రాజమౌళి మరో ఆనందాన్ని పంచాడు . రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా రామ్ చరణ్ ఫస్ట్ లుక్ తో ఓ చిన్న వీడియోను రిలీజ్ చేశారు . కొమరం భీమ్ గా చేస్తున్న ఎన్టీఆర్ రామరాజుగా చేస్తున్న రామ్ చరణ్ కి ఇచ్చే గిఫ్ట్ గా దీన్నిరూపొందించాడు జక్కన . ఎన్టీఆర్ నిమిషం కంటే ఎక్కువ సేపు ఉన్న వీడియోలో అల్లూరి సీతారామరాజుని పరిచయం చేసిన భీమ్ తన వాయిస్ ఓవర్ తో ఆశ్చర్యపరిచాడు. ఐదుభాషల్లో రిలీజ్ చేసిన ఈ వీడియోకి నాలుగుభాషల్లో వాయిస్ ఓవర్ ని అందించాడు ఎన్టీఆర్.త్రం చరణ్ లుక్ రివీల్ అవ్వడంతో ఆయన ఫ్యాన్స్ అంత చాలా హ్యాపీగా ఉన్నారు. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానుల వంతు వచ్చింది. మే 20 కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఆ రోజు యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు . ఆ రోజు ఎన్టీఆర్ లుక్ రివీల్ చేసే అవకాశం ఉంది . కొమరం భీం గా ఎన్టీఆర్ ను జక్కన ఎలా చూపించబోతున్నాడో తెలుసుకుందుకు ఫ్యాన్స్ అంత ఎంతో ఆతృతగా ఎదురు చుస్తునారు. మరి ఎన్టీఆర్ అభిమానులను రాజమౌళి ఎలా ఆశ్చర్య పరుస్తాడో చూడాలి.

they showed me as aunty : payal

ALLU ARJUN REJECTED MOVIES!