
రామ జోగయ్య శాస్ట్రీ గారు, తెలుగు గేయ రచయిత ,దాదాపు 1200 పాటలు రాసిన మేటి రచయిత, కానీ అయన గారి ఫోన్ లో రింగ్ టోన్ మాత్రం కన్నడ పాట వినిపిస్తుంది, కన్నడ లో వారు రాసింది కొన్ని పాటలే, నిజమండి బాబు, నమ్మటం లేదు కదూ. అలాగని అయన కన్నడిగుడు కాదు, నూటికి నూరు పాళ్ళు తెలుగు వారు. మరి కన్నడ పాట రింగ్ టోన్ ఎందుకు పెట్టుకున్నారో తెలుసుకోవాలని ఉందా? అయితే ఇక చదవండి, బెంగుళూరు లో ఇంజనీర్ గ తన జీవితాన్ని ప్రారంభించిన శాస్ట్రీ గారు,ఎప్పటికయినా మంచి గాయకుడు కావాలి అనుకునే వారు, అనుకోకుండా కన్నడ సినిమా లో పాటలు రాసె అవకాశం వచ్చింది దానితో గుర్తింపు పొందిన శాస్ట్రీ గారు, డబ్బింగ్ పనులకు హైదరాబాద్ రావటం, సిరివెన్నెల గారి వద్ద శిష్యుడిగా చేరిపోయారు ఆ తరువాత” యువ” అనే డబ్బింగ్ చిత్రం లో పాటలు రాసె అవకాశం రావటం తో రచయిత గ తెలుగు ఆడియన్స్ కు పరిచయం అయ్యారు. పదునయినా మాటలతో పాటలు వ్రాయటంలో దిట్ట అనిపించుకున్నారు. కానీ అనుకోకుండా తనను గేయ రచయిత గ మార్చిన కన్నడ భాష మీద కృతజ్ఞత తో కన్నడ పాటను రింగ్ టోన్ గ పెట్టుకున్నారు. ఇళయరాజా గారి ఆరాధకుడిగా అయన మ్యూజిక్ డైరెక్షన్ లో వచ్చిన కన్నడ హిట్ సాంగ్ శాస్ట్రీ గారి ఫోన్ లో రింగ్ టోన్ గ పెట్టుకున్నారు, ఇదండీ విషయం. మీ సందేహం తీరింది అనుకుంట.

