in

Ram Pothineni signs a web series with netflix?

ప్పటికే తెలుగులో రానా నాయుడు వెబ్ సిరీస్ చేసి సంచలనం సృష్టించారు బాబాయ్, అబ్బాయ్ వెంకటేష్, రానా. అలాగే..అక్కినేని నాగ చైతన్య కూడా ‘ధూత’ అనే వెబ్ సిరీస్ చేసి హిట్ కొట్టాడు. ఇదే దారిలో వెళ్లడానికి ఇంకొంతమంది టాలీవుడ్ స్టార్స్ రెడీ అవుతున్నారు. ఇప్పుడు ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని కూడా డిజిటల్ ఎంట్రీకి ప్లానింగ్ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది.

రానా నాయుడు తరహాలో నెట్ ఫ్లిక్స్ రామ్‌తో ఒక భారీ బడ్జెట్ వెబ్ సిరీస్‌కు రంగం సిద్ధం చేస్తున్నట్టుగా సమాచారం. ఇప్పటికే..ఇద్దరు ముగ్గురు దర్శకులను లైన్లో పెట్టి.. రామ్ దగ్గరికి పంపినట్టుగా చెబుతున్నారు. రామ్ కూడా కథ నచ్చితే వెబ్‌ సిరీస్ చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పినట్టుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ విషయంలో..రామ్ సైడ్ నుంచి ఇంకా డెసిషన్ పెండింగ్‌లో ఉందని అంటున్నారు..!!

sai pallavi signs back to back movies again!

happy birthday k RAGHAVENDRA RAO!