in

Ram Pothineni shuts down dating Bhagyashri Borse rumours!

ఆంధ్ర కింగ్ తాలూకా’ ప్రారంభమైనప్పటి నుండి హీరో రామ్, హీరోయిన్ భాగ్యశ్రీల మధ్య ఏదో నడుస్తుందనే పుకార్లు చక్కర్లు కొట్టాయి. దీనికి తోడు, ఈ సినిమా కోసం రామ్ స్వయంగా పాటలు రాయడం, పాడటం కూడా చేయడంతో వారిద్దరి మధ్య నిజంగానే ఏదో రిలేషన్ నడుస్తుందని అందరూ అనుకున్నారు. ఇక ఇప్పుడు ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా రామ్‌కు ఈ విషయంపై ఓ ప్రశ్న ఎదురైంది.

భాగ్యశ్రీతో రామ్ డేటింగ్‌లో ఉన్నారా..? అని ఓ ఇంటర్వ్యూలో ఆయనకు ప్రశ్న ఎదురైంది. దీనికి చాలా కూల్‌గా సమాధానమిచ్చాడు రామ్. తమ మధ్య అలాంటిది ఏమీ లేదని..ఆన్‌స్క్రీన్‌లో తమ జోడీ మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా రావడంతో జనాల్లో ఈ ప్రశ్న తలెత్తిందని..అంతే తప్ప.. వారి మధ్య నిజంగా అలాంటి రిలేషన్ ఏమీ లేదని రామ్ తేల్చేశాడు. అటు భాగ్యశ్రీ కూడా తమది మంచి ఫ్రెండ్‌షిప్ మాత్రమే అని చెప్పడంతో వారి మధ్య డేటింగ్ రూమర్స్‌కు చెక్ పడింది..!!

Malavika Mohanan gets unexpected things with ‘The Raja Saab’!