రామ పాదం సోకి రాయి అహల్య గ మారింది, బల ప్రదర్శన కు ఉపయోగించే రాతి గుండు, రామ్, లక్ష్మణ్ అనే ఫైట్ మాస్టర్స్ ను సినీ పరిశ్రమకు అందించింది. ఎక్కడిది ఈ రాతి గుండు ఏమిటి ఆ కధ తెలుసుకోవాలని ఉందా. పశువులను, మేకలను కాసుకుంటూ బడి ముఖం చూడని ఇద్దరు నూనూగు మీసాల కుర్రాళ్ళ కన్ను .ఉరి మధ్యన పడి యున్న రాతి గుండు మీద పడింది, దానిని ఎలాగైనా ఎత్తి ఉరి జనం తో సెహబాష్ అనిపించుకోవాలి అనుకున్నారు. పట్టుదలతో ప్రయత్నించి ఎత్తగలిగారు, ఒక పండుగ రోజు ఉరి జనం ముందు ఆ రాతి గుండును ఎత్తుతామని ప్రకటించారు, ఉరి జనం అంత వెటకారంగా చూసారు, పెద్ద పెద్ద వస్తాదులు ఎత్తిన గుండు అది మీ వల్ల కాదు అన్నారు, రామ్, లక్ష్మణ్ చెరొకసారి ఆ రాతి గుండును ఎత్తి అవతల పడేసారు, ఊరంతా ఆశ్చర్య పోయారు .
ram lakshnam la gari jeevithanni marchesina aa okka sangatana!
అప్పుడు మొదలైనది కొత్తగా ఏదో సాధించాలి అని, అప్పటికే తమ పక్క ఉరి వాడయినా రాజు మాస్టర్, ఫైట్ మాస్టర్ గ సినీ పరిశ్రమలో చక్రం తిప్పుతున్నారు. స్టేజి నటుడు అయిన రామ్, లక్ష్మణ్ తండ్రి గారు వీరిద్దరిని రాజు మాస్టర్ కి పరిచయం చేసారు. అంతే స్వాతిముత్యం కమల్ హాసన్ లాగా రాజు మాస్టర్ ని తగులుకున్నారు వీళ్లిద్దరు. ఆరు నెలల సుదీర్ఘ నిరీక్షణ తరువాత రాజు మాస్టర్ కనికరించడం, అప్పటివరకు ప్యాంటు ముఖం చూడని వీరు 70 రూపాయలతో ఫాంట్లు కొని తొడుక్కొని చీరాలలో సర్కార్ ఎక్ష్ప్రెస్స్ ఎక్కేసారు. రాతి గుండు దీవెన, రాజు మాస్టర్ సహకారం, వీరి నిరంతర శ్రమ ఫలితంగా దక్షిణ భారతీయ సినిమా పరిశ్రమలో తిరుగులేని ఫైట్ మాస్టర్స్ గ ఎదిగారు.