in

Ram Gopal Varma convicted in Cheque Bounce Case!

ర్మకు బిగ్ షాక్ తగిలింది. చెక్ బౌన్స్ కేసులో వర్మకు 3 నెలల సాధారణ జైలు శిక్ష పడింది. ముంబైలోని అంధేరీ మేజిస్ట్రేట్ కోర్టు చెక్ బౌన్స్ కేసులో వర్మను దోషిగా తేలుస్తూ మూడు నెలల జైలు శిక్షతో పాటుగా జరిమానాను కూడా విధించింది. వాస్తవానికి ఈ కేసు ఇప్పటిది కాదు గత ఏడేళ్లుగా కోర్టులో విచారణ జరుగుతోంది.  తాజాగా కోర్టు తీర్పు వెలువరించింది.  అయితే ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా వర్మ కోర్టుకు గైర్హాజరయ్యారు.

దీనిని దృష్టిలో ఉంచుకుని  కోర్టు అతడిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.  భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 138 ప్రకారం వర్మను దోషిగా నిర్ధారించారు. మూడు నెలల్లోగా ఫిర్యాదుదారుడికి వర్మ రూ.3.72 లక్షల పరిహారం చెల్లించాలని, లేదంటే మరో మూడు నెలలు సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని కోర్టు వెల్లడించింది.  ఈ నేరం నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ చట్టంలోని సెక్షన్ 131 కిందకు వస్తుందని, దీని కింద చిత్రనిర్మాతపై చట్టపరమైన చర్య తీసుకోబడిందని కోర్టు అభిప్రాయపడింది..!!

Balakrishna, Trisha reunite for Gopichand Malineni’s film?