గేమ్ చేంజర్ సినిమా ఫ్లాప్ అవడంతో చరణ్ దిల్ రాజుకు ఒక మాట ఇచ్చారని ఇటీవల ఒక సందర్భంగా ఆయన వెల్లడించారు. ప్రస్తుతం రామ్ చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు ఈ సినిమా తర్వాత సుకుమార్ డైరెక్షన్లో మరో సినిమా చేయబోతున్నారు. ఇలా ఈ రెండు సినిమాలు పూర్తి కాగానే మరోసారి దిల్ రాజు నిర్మాణంలో ఈయన సినిమా చేయబోతున్నారని..
ఆ సినిమా కోసం తాను రూపాయి కూడా రెమ్యూనరేషన్ లేకుండా నటిస్తాను అంటూ ప్రామిస్ చేశారట. రామ్ చరణ్ ఒకసారి మాట ఇస్తే ప్రాణం పోయినా ఆ మాట తప్పరని దిల్ రాజు తెలియజేశారు. ఈ సినిమా కోసం రూపాయి కూడా రెమ్యూనరేషన్ తీసుకోకుండా ఈ సినిమా మంచి మార్కెట్ జరుపుకొని మంచి సక్సెస్ అయితేనే తనకు కొంత మొత్తంలో రెమ్యూనరేషన్ ఇవ్వాలని లేకపోతే రెమ్యూనరేషన్ కూడా అవసరం లేదని చరణ్ చెప్పినట్టు దిల్ రాజు వెల్లడించారు..!!