in

Rakul Stayed In Water For 14 hours For ‘I Love You’ Scene!

టి రకుల్ ప్రీత్ సింగ్ తన రాబోయే చిత్రం ‘ఐ లవ్ యు’ కోసం తెగ కష్టపడింది. సినిమాలోని ఒక సన్నివేశం కోసం, ఈ హీరోయిన్ 2నిమిషాల 30 సెకన్ల పాటు నీటి అడుగున ఉండవలసి వచ్చింది. దాని కోసం సిద్ధం కావడానికి పడిన కష్టాన్ని ఆమె బయటపెట్టింది. “నేను నా ఎమోషన్స్ ను కంట్రోల్ చేసుకోవాలి. మైండ్ ను కంట్రోల్ చేసుకోవాలి. నీటి లోపల టెన్షన్ పడకూడదు. దీని కోసం ఒక నెల పాటు కఠినమైన శిక్షణ తీసుకున్నాను. అండర్ వాటర్ సీక్వెన్స్ కోసం శిక్షణలో, అజహాన్ అడెన్‌వాలా అనే స్కూబా ట్రైనర్ నాకు శిక్షణ ఇచ్చాడు. నీటి అడుగున 2 నిమిషాల 30 సెకన్ల పాటు ఊపిరి బిగపట్టడంపై శిక్షణ ఇచ్చారు.”

ఎట్టకేలకు ట్రైనింగ్‌ పూర్తి చేసుకొని నీటిలోకి దిగింది రకుల్. మధ్యాహ్నం 2 నుండి మరుసటి రోజు ఉదయం 4 గంటల వరకు ఏకధాటిగా షూటింగ్ చేశారు. నీటి అడుగున షూట్ చేసిన ఈ సీక్వెన్స్ తన లైఫ్ లో మరిచిపోనని చెబుతోంది రకుల్. ఆమె శరీరం పూర్తిగా చల్లబడిపోకుండా.. ప్రతి షాట్ తర్వాత రకుల్ ఒంటిపై వేడి నీరు పోశారు. అయితే నీటిలో ఉన్న క్లోరిన్ కారణంగా రకుల్ కళ్లు మంటలు పుట్టాయి. ఇది ఊహించని సమస్యగా మారింది. వీటన్నింటినీ దాటి సీక్వెన్స్ షూట్ పూర్తిచేసింది రకుల్. ఈ సినిమాను జియో సినిమా యాప్ లో ప్రీమియర్ కు సిద్ధం చేశారు..!!

Krithi Shetty In Sushmita Konidela’s Female-Centric Film?

trisha with chiranjeevi after 17 years?