
హీరోయిన్ అయ్యే సమర్ధత తన కుమార్తెలో ఉన్న విషయం తనకు ముందుగానే తెలుసు అని నటి రకుల్ ప్రీత్‌సింగ్ తల్లి రినీసింగ్ అన్నారు. అందుకే ఆమెను ప్రోత్సహిం చినట్టు తెలిపారు. బికినీ వేసుకొమ్మని అమ్మ ప్రోత్సహించింది అని రకుల్ చెప్పింది. బికినీలు కొనేసమయంలో ఎలాంటి కలర్స్ కొనాలో నాన్న చెప్పేవారు. నాన్న నా క్రిటిక్. నా డ్రస్ కలర్స్ గురించి మొహమాటం లేకుండా చెబుతుంటారని రకుల్ తెలిపింది. ఇటీవల తల్లికూతుళ్లు ఇద్దరు ఇచ్చిన ఓ ఇంటర్యూలో ఈ విషయం వెల్లడించారు. ఢిల్లి కి చెందిన రకుల్ తమ పెళ్లి గురించి కూడా స్పష్టత ఇచ్చింది. నువ్వు ఎవరినైనా చూసుకో లేదంటే మేం ఓ అబ్బాయిని వెతికి పెడతాం అని అన్నారు. పెద్దలు కుదిర్చిన వివాహానికి నేను వ్యతిరేకం కాదు అని రకుల్ పేర్కొంది. ఇటీవల కరోనా వల్ల ఇబ్బంది పడుతున్న వారికి ఆమె భోజన సదుపాయం కల్పించారు.

