in

Rakul reveals why she is open about her relationship with Jacky Bhagnani!

బాలీవుడ్‌లో నటీ, నటులు రిలేషన్‌షిప్‌లో ఉండటం, ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకోవడం తరచూ జరుగుతూనే ఉంటాయి. అయితే చాలా సందర్భాల్లో మీడియా ముందు వారు తమ రిలేషన్‌షిప్ గురించి బయటకు చెప్పేందుకు సెలబ్రెటీలు భయపడుతుంటారు. చివరి వరకు సైలెంట్‌గా ఉంచి.. ఆ తర్వాత ఆ విషయాన్ని తెలియజేస్తారు. కలిసి విహారయాత్రలకు వెళ్లినప్పపటికీ.. తమ మధ్య ఎలాంటి బంధం లేదని చెప్పే వాళ్లున్నారు. అయితే రకుల్ ప్రీత్ సింగ్ ఈ సంప్రదాయానికి బ్రేక్ చేసి ఈ ఏడాది ప్రారంభంలోనే తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ద్వారా జక్కీ భగ్నానీతో రిలేషన్‌లో ఉన్నట్లు చెప్పుకొచ్చింది. ఇటీవలో హిందుస్థాన్ టైమ్స్‌తో జరిగిన ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. సెలబ్రెటీలు ఇలా చేయడానికి గల కారణాన్ని వివరించింది..

తమ పని నుంచి దృష్టి మరలుస్తారనే భయంతో కొంతమంది నటీ, నటుల తమ విషయాన్ని బయటకు చెప్పేందుకు సంకోచిస్తారని రకుల్ చెప్పింది. “అవును.. చాలా మందిలో ఇలాంటి మనస్తత్వమే ఉంటుంది. నా పని నుంచి దృష్టి మరలుస్తుందనే కారణంతో కొంతమంది తమ వ్యక్తిగత విషయాలను బయటకు చెప్పరు. కానీ మనం 2022లో ఉన్నాం. నా వ్యక్తిగత జీవితం.. వృత్తిపరమైన విశ్వసనీయతను దెబ్బతీస్తుందనుకుంటే ఏదో తప్పు జరుగుతుందని అర్థం. దాన్ని సరిదిద్దాలి. అది నన్ను ప్రభావితం చేస్తే.. నేను దాన్ని మార్చబోతున్నాను. ఎందుకంటే నేను నా జీవితాన్ని రెండు మార్గాల్లో జీవించాలనుకునే వ్యక్తిని కాదు.” అని రకుల్ స్పష్టం చేసింది..తను ఎవరితో డేటింగ్ చేస్తున్నానే విషయంపై ఎలాంటి కపటం లేకుండా ఉండాలని రకుల్ వివరించింది..!!

pooja hegde to act with kriti sanon, Jacqueline Fernandez!

happening beauty Krithi Shetty debuting the Malayalam industry!