తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రకుల్ ప్రీతిసింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె కెరటం సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైనప్పటికీ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది.ఇలా తెలుగు తమిళ భాషలలో మాత్రమే కాకుండా వరుస బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ పూర్తిగా బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన రకుల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈమె నటించిన డాక్టర్ జీసినిమా విడుదలైన విషయం మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా విడుదలైన సందర్భంగా రకుల్ ప్రీతిసింగ్ గతంలో చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు ఈ సందర్భంగా వైరల్ అవుతున్నాయి.
2011 వ సంవత్సరంలో రకుల్ ప్రీతిసింగ్ మిస్ ఇండియా అందాల పోటీలో పాల్గొన్నారు. ఈ పోటీలలో భాగంగా రకుల్ ప్రీతిసింగ్ కి గే గురించి కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి. మీ కొడుకు కనుక గే అయితే మీరేం చేస్తారు అనే ప్రశ్న రకుల్ కు ఎదురయింది.ఈ ప్రశ్నకు ఈమె సమాధానం చెబుతూ తను గే అని తెలిసిన వెంటనే ముందుగా తను షాక్ అవుతాను అనంతరం తన చెంప పగలగొడతాను..అనంతరం తాను ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు తెలుసుకొని పూర్తిగా తనుకు నచ్చినట్టు తనని బ్రతకడానికి స్వేచ్ఛ ఇస్తానంటూ ఈ సందర్భంగా గతంలో రకుల్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి..!!