రెండు నెలల క్రితం రకుల్ గాయపడిన సంగతి తెలిసిందే. 80 కేజీల బరువును ఎత్తే క్రమంలో ఆమెకు గాయం కావడంతో వైద్యుల సలహా మేరకు రెస్ట్ తీసుకున్నారు. దీనిపై రకుల్ స్పందస్తూ…ఇప్పుడిప్పుడే తాను కోలుకుంటున్నానని చెప్పారు. వెన్నుకు గాయమైనప్పుడు రెండు వారాల్లో తగ్గిపోతుందనుకున్నానని…కానీ ఇప్పటికి ఎనిమిది వారాలయిందని తెలిపారు. ప్రస్తుతం ఎక్కువ బరువులు ఎత్తడం లేదని రకుల్ చెప్పారు..
చిన్నచిన్న వర్కౌట్లు చేస్తున్నానని…ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటున్నానని తెలిపారు. బరువు తగ్గడం ఎంతో కష్టమైన పని అని, ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్ అలవాటు చేసుకోవాలని సూచించారు. జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలని, రెగ్యులర్ గా వర్కౌట్లు చేయాలని చెప్పారు. మంచి నీళ్లు ఎక్కువగా తాగాలని రకుల్ సూచించారు. ఉదయం నిద్ర లేచిన వెంటనే గోరు వెచ్చటి నీరు లేదా పసుపు కలిపిన గోరు వెచ్చటి నీరు తాగితే చర్మం కాంతివంతంగా తయారవుతుందని చెప్పారు..!!