in

Rakul Preet Singh Reveals Was Replaced in Prabhas Movie!

తెలుగు స్టార్ హీరోలతో నటించిన రకుల్ హవా ఇటీవల కాలంలో పూర్తిగా తగ్గిపోయింది. టాలీవుడ్‌లో చివరిగా కొండపొలం చిత్రంలో నటించారు. ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీబీజీగా ఉన్న రకుల్ .. తాజాగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. గతంలో తనను ప్రభాస్ సినిమా నుండి చెప్పకుండానే తీసేశారని చెప్పింది. ఒక యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రకుల్ మాట్లాడుతూ..

కెరీర్ తొలినాళ్లలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చిందన్నారు. సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న సమయంలో ప్రభాస్ సరసన నటించే అవకాశం రావడంతో చాలా సంతోషించానని చెప్పింది. అయితే నాలుగు రోజుల పాటు షూటింగ్ పూర్తి చేసుకుని తాను ఢిల్లీకి వెళ్లగా, ప్రభాస్ సినిమా నుండి తనను తొలగించినట్లు తెలిసిందన్నారు. కనీసం సమాచారం కూడా ఇవ్వలేదని పేర్కొంది..!!

Janhvi Kapoor about getting multiple offers in Tollywood!

The Great N.T.Rama Rao – One and Only Legend!