తెలుగు, తమిళ్, కన్నడ, అటు హిందీ పరిశ్రమలో కూడా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది ఈ చిన్నది. దాదాపు టాలీవుడ్ టాప్ హీరోలందరితో సినిమాలు చేసింది రకుల్. ఇక రకుల్ సోషల్ మీడియాలోనూ చాలా వ్యక్తీవ్ గా ఉంటుంది . రెగ్యులర్ గా ఫిట్నెస్ వీడియోలు , ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది. తాజాగా రకుల్ పాడిన ర్యాప్ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రకుల్ ప్రీత్ సింగ్ ”కరే ని కర్దా రాప్ ఛాలెంజ్” లో పార్టిసిపేట్ చేసింది.
దీనికి సంబంధించిన వీడియోను ఇంస్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది.ఈ ఛాలెంజ్ కు నటుడు టీవీ హోస్ట్ అపరశక్తి ఖురానా ని రకుల్ నామినేట్ చేసింది.యోయో హనీ సింగ్ ”ఛలాంగ్” సినిమా కోసం ‘కరే ని కర్దా’ ర్యాప్ పాడిన నేపథ్యంలో ‘కరే ని కర్దా రాప్ ఛాలెంజ్’ క్రియేట్ చేసారు. దీంట్లో ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు భాగస్వామ్యులు అయ్యారు. ఇక రకుల్ ప్రస్తుతం ఉప్పెన సినిమాతో పరిచయమైన మెగా హీరో వైష్ణవ్ తేజ్ సరసన క్రిష్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తుంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది. మరో వైపు కమల్ హాసన్ సరసన భారతీయుడు 2 లో నటిస్తుందని వార్తలు వస్తున్నాయి.