రకుల్ సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 16 ఏళ్లు గడుస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా తన సినీ కెరీర్‌కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకుందీ బ్యూటీ. ఈ సందర్భంగా రకుల్ మాట్లాడుతూ.. ఈ సినీ జీవితంలో ఎన్నో ఎత్తులూ, పతనాలూ ఎదురైనా.. ప్రతి దాన్ని ఓ అనుభవంగా తీసుకుంటూ ముందుకు సాగానన్నారు. ‘‘ఈ రంగంలో విజయాలు, పరాజయాలు సహజం. ప్రతి ఒక్కరికి ఎదురయ్యే పాఠాలే ఇవి. కష్టాలు వచ్చినప్పుడు వెనక్కి తగ్గకూడదు..
ఆ కష్టాలే మనల్ని బలంగా తయారుచేస్తాయి. నాకు బిజీగా ఉండడం అంటే చాలా ఇష్టం. నా జీవితంలో ప్రశాంతత అనేది పని మధ్యలోనే దొరుకుతుంది. షూటింగ్‌ల మధ్యన పని లేకుండా ఖాళీగా ఉన్నపుడు కానీ ఒత్తిడిగా అనిపించదు. కెమెరా ముందుండటమే నాకు జీవనవిధానం అయిపోయింది. ప్రతిరోజూ సెట్స్‌కి వెళ్లి పని చేయడం జీవితంలో భాగంగా మారిపోయింది. ఇదే దినచర్య నాకు ప్రేరణ ఇస్తుంది. ఇదే కొనసాగాలని ఆశిస్తున్నాను,’’ అని ఆమె అన్నారు..!!