in

Rakul Preet revealed why she chose playing Surpanakha in Ramayana!

రామాయణ’ ట్రైలర్ విడుదలైనప్పటి నుంచే రకుల్ పోషిస్తున్న శూర్పణఖ పాత్రపై ప్రేక్షకుల్లో తీవ్రమైన ఉత్సుకత నెలకొంది. ఈ పాత్రను ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చిందనే దానిపై స్పందిస్తూ.. సాధారణంగా తనకు సవాలుతో కూడిన, కాస్త భిన్నమైన పాత్రలు చేయడం ఎంతో ఉత్సాహాన్ని ఇస్తాయని రకుల్ తెలిపారు. శూర్పణఖ పాత్రను సరిగ్గా అర్థం చేసుకోవడం చాలా కష్టంతో కూడుకున్నదని, అందుకే దర్శకుడు నితేశ్‌ తివారీ ఈ పాత్ర గురించి చెప్పగానే క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఆమె వెల్లడించారు.

ఇప్పటివరకు వచ్చిన పురాణ గాథల్లో శూర్పణఖ పాత్రను కేవలం ఒక ప్రత్యేక సన్నివేశంలోనో లేదా పరిమితంగానే అందరూ చూశారని, కానీ ఈ సినిమాలో ఆమె పాత్రకు సంబంధించిన లోతైన కథ, అనేక వేదనలు ఉన్నాయని రకుల్ పేర్కొన్నారు. ‘రామాయణ’ చిత్రం విడుదలైన తర్వాత ప్రేక్షకులు శూర్పణఖను కేవలం ఒక నెగెటివ్ పాత్రలా కాకుండా, పూర్తిగా భిన్నమైన ఇతర కోణాల్లోనూ చూస్తారని, ఆ కోణాలను ప్రేక్షకులు కచ్చితంగా ఆస్వాదిస్తారని తాను గట్టిగా ఆశిస్తున్నట్లు ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఈ విజువల్ వండర్ మూవీలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తుండగా..!!

dragon, toxic beauty rukmini vasanth onboard for rc17?