in

Rakul Preet opens up about relationship with Jackky Bhagnani!

బాలీవుడ్లో నిర్మాతగా పేరు సంపాదించిన జాకీ భగ్నాని తో కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిన విషయమే. అయితే రకుల్ ప్రీతిసింగ్ ఇప్పటివరకు పెళ్లి గురించి ఎక్కడ స్పందించలేదు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రకుల్ ప్రీతి సింగ్ ఈ విషయం పై స్పందించారు. “ప్రతి ఒక్కరి జీవితంలో కూడా భాగస్వామ్యం కలిగి ఉండడం చాలా సహజమైన ప్రక్రియ. సినీ ఇండస్ట్రీలో ఉన్న వారిపై ఈ విషయంలో పలు రకాల ఊహాగానాలు సైతం వినిపిస్తూ ఉంటాయి..

నేను కూడా ఎన్నో సంవత్సరాలుగా ఒంటరిగా జీవించాను. అలా జీవిస్తున్న నా జీవితంలోకి జాకీ వచ్చారు. అతను వచ్చాక పూర్తిగా నా జీవితం మారిపోయింది. జాకీ కూడా ఇదే పరిశ్రమకి చెందిన వ్యక్తి కావడంతో నన్ను పూర్తిగా అర్థం చేసుకున్నారంటూ తెలియజేసింది ఈ ముద్దుగుమ్మ. అంతేకాకుండా తామిద్దరము సినిమా ఫిట్నెస్ ని ఇష్టపడతాం” అంటూ తెలిపింది. ఇక ప్రతిరోజు 12 గంటలు షూటింగ్లో బిజీగానే ఉంటామని, గంట మాత్రమే కలిసి సమయాన్ని గడుపుతూ, తమ వ్యక్తిగత విషయాలను మాత్రమే మాట్లాడుకుంటామంటూ తెలియజేశారు..!!

Hanuman created a record on Book My Show!

Sreeleela Rejects alcohol and betting apps deal?