in

Rakul Preet makes her relationship with Jackky Bhagnani!

కుల్ ప్రీత్ సింగ్ ప్రేమలో పడింది. ప్రేమలో పడటమే కాదు తన ప్రేమికుడి పేరుని కూడా ప్రకటించింది. బాలీవుడ్‌ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీని ప్రేమిస్తున్నట్టు వెల్లడించింది. జాకీ భగ్నానీతో కలిసి దిగిన ఫొటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది ‘థ్యాంక్‌ యు మై లవ్‌. ఈ ఏడాది నేను అందుకున్న పెద్ద గిఫ్ట్ నువ్వే. నా జీవితంలో రంగులు నింపినందుకు, నన్ను నవ్విస్తున్నందుకు …”అని లవ్ సింబల్స్ తో తన ప్రేమని తెలియబరిచింది రకుల్.

ప్రేమ విషయం తెలియజేయడంతో రకుల్ కు అభిమానులు కంగ్రాట్స్ చెబుతున్నారు. త్వరలోనే మూడుముళ్ల బంధంతో ఒక్కటి కావాలని కోరుకుంటున్నారు. జాకీ భగ్నానీ చాలా లక్కీ అని ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు. జాకీ విషయానికి వస్తే ప్రముఖ బాలీవుడ్ నిర్మాత వశు భగ్నానీ తనయుడు జాకీ భగ్నానీ. ‘రెహ్నా హై తేరే దిల్‌ మే‌’ చిత్రంతో నటుడిగా పరిచయం అయ్యాడు.‘ఫాల్తు’, ‘అజబ్‌ గజబ్‌ లవ్‌’, ‘యంగిస్థాన్‌’, ‘వెల్‌కమ్‌ టు కరాచీ’సినిమాలో నటించాడు. ‘సర్జ్బిత్‌’, ‘దిల్‌ జంగ్లీ’, ‘వెల్‌కమ్‌ టు న్యూయార్క్‌’, ‘కూలీ నం. 1’, బెల్‌ బాటమ్‌, మహా వీర్ కర్ణ చిత్రాలని నిర్మించాడు.

malvika sharma snapped at an interview!

TV Anchor Suma Kanakala suffering with Skin Diseases!