in

Rakul Preet Exposes Fake WhatsApp Account!

8111067586 అనే ఫోన్ నంబర్‌కు తన ఫొటోను డీపీగా పెట్టి, బయోలో తాను నటించిన సినిమాల పేర్లను రాసి.. కొందరు వ్యక్తులకు సందేశాలు పంపుతున్నట్లు రకుల్ గుర్తించారు. ఈ విషయం తెలియగానే ఆమె వెంటనే స్పందించారు. ఫేక్ చాట్ స్క్రీన్‌షాట్‌ను షేర్ చేస్తూ, “నా పేరుతో ఎవరో వాట్సాప్‌లో ప్రజలకు సందేశాలు పంపుతున్నారు. దయచేసి ఆ నంబర్‌కు స్పందించకండి. అది నాది కాదు” అని స్పష్టం చేశారు.

ఇదిలావుంచితే, గతంలో నటి అదితి రావు హైదరి పేరుతో కూడా ఓ నకిలీ వాట్సాప్ నంబర్ ద్వారా ఫోటోగ్రాఫర్లకు మెసేజ్‌లు వెళ్లాయి. దీనిపై ఆమె స్పందిస్తూ, తన అధికారిక పనులన్నీ టీమ్ ద్వారానే జరుగుతాయని వివరణ ఇచ్చారు. అలాగే ‘కాంతార: చాప్టర్ 1’ ఫేమ్ రుక్మిణి వసంత్ పేరుతోనూ కొందరు మోసాలకు పాల్పడటంతో ఆమె కూడా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ప్రజలను అప్ర‌మ‌త్తం చేశారు..!!

HAPPY BIRTHDAY NAGA CHAITANYA!

keerthy suresh turns to director!