[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]ర[/qodef_dropcaps] కుల్‌ప్రీత్‌సింగ్ తెలుగు ప్రేక్షకులను తన అందాలతో ఖుషీ పరిచింది. దీంతో స్టార్ ఇమేజ్ వచ్చేసింది. యువ స్టార్ హీరోలందరితోనూ జత కట్టేసింది. ఇదంతా చకచకా జరిగిపోయింది. వెనుదిరిగి చూస్తే ఇప్పుడు అవకాశాలు ముఖం చాటేస్తున్నాయి.
తెలుగులో చాలా గ్యాప్ తరువాత ఒక చిత్రంలో నటిస్తోంది. నటిగా తన కెరీర్‌ను పునఃపరిశీలించుకున్న రకుల్ ప్రీత్‌సింగ్ అవకాశాలు అడుగంటడానికి కారణాలను విశ్లేసించుకున్నట్టుంది. దీని గురించి ఈ అమ్మడు తెలుపుతూ తాను వరుసగా అందాలారబోతకే ప్రాధాన్యతనిచ్చానని, అది ఎంత పెద్ద తప్పో ఇప్పుడు అర్థమైందని అంది.
తాను ఏ దర్శక, నిర్మాతకు సమస్యలు తెచ్చి పెట్టలేదని, పారితోషికం విషయంలో కూడా పట్టు విడుపు పాటించానని చెప్పింది.
ఎవరితోనూ గొడవ పడలేదంది. షూటింగ్‌లకు టైమ్‌కు వెళ్లేదాన్నని చెప్పింది.అయినా అవకాశాలు తగ్గిపోయాయంటే అందుకు కారణం తాను గ్లామరస్‌గా నటించడమేనని పేర్కొంది. నటనకు ప్రాధాన్యత కలిగిన పాత్రలను ఎంపిక చేసుకోకుండా కేవలం గ్లామర్‌కే పరిమితం అయ్యానని, ఫలితం అవకాశాలు దూరం అయ్యాయని ఆవేదన వ్యక్తం చేసింది. చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏం వస్తుంది అన్నది ఈ అమ్మడికి తెలియదనుకుంటా. అయితే ప్రస్తుతం రకుల్‌ప్రీత్‌సింగ్ శాఖాహారానికి మారిందట. దీని గురించి తను తెలుపుతూ తానిప్పుడు శాఖాకారిగా మారానని, దాన్ని పాటిస్తున్నానని చెప్పింది.
ముంబయిలో షూటింగ్ అయితే భోజనం ఇంటి నుంచే వస్తుందని చెప్పింది. శాఖాహారమే తింటానని చెప్పింది. పళ్లు, పళ్లరసం ఎక్కువగా తీసుకుంటానని చెప్పింది.