రకుల్ తక్కువ టైమ్ లో స్టార్ హీరోలందరితో నటించినా..సక్సెస్ పర్సెంటేజ్ మాత్రం చాలా తక్కువ. తెలుగులో హిట్ కొట్టి మూడేళ్లు అయింది. రారండోయ్ వేడుక చూద్దాం.. తర్వాత హిట్ దక్కలేదు. స్పైడర్ మన్మథుడు 2లో నటించినా.. సక్సెస్ దక్కలేదు. తమిళం.. హిందీలో ఒకటి రెండు సినిమాలు చేస్తున్నా.. కెరీర్ పై నమ్మకం కుదరడం లేదు. ఇక వ్యాపారమే దిక్కని భావించి.. ఇందులో మెళకువలు నేర్చుకోవడానికి ఎంబిఎలో జాయిన్ అయింది రకుల్. నిన్నటి వరకు కెమెరా ముందు ఆడిపాడిన రకుల్.. స్టూడెంట్ అవతారం ఎత్తింది.
రీల్ లైఫ్ లోనే కాకుండా.. రియల్ లైఫ్ లో పుస్తకాలు పట్టుకుంది. మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చూస్తే.. ఈ చదువు తన వ్యాపారాలకు ఉపయోగపడుతుందన్న నమ్మకంతో ఉంది రకుల్. ఎంతైనా ఈ హీరోయిన్ తెలివితేటలు ఎక్కువే. ఛాన్సులు వస్తే చేద్దాం.. లేదంటే.. బిజినెస్ చూసుకుందాం.. అనేలా.. బిజినెస్ మైండ్ తో ఆలోచిస్తోంది రకుల్. మొత్తానికి రకుల్ ప్రీత్ సింగ్ కొత్త రూట్ ను ఎంచుకుంది. అయితే సినిమాలు లేకపోతే బిజినెస్ అనేలా ఆల్టర్ నేట్ ప్లాట్ పామ్ ను సిద్ధం చేసుకుంది.