in

Rajkumar Hirani to work with Ram Charan next?

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ప్రస్తుతం సెన్సేషనల్ దర్శకుడు శంకర్‌తో ఓ భారీ పాన్ఇండియా మూవీ చేస్తున్నాడు. ఆ తరువాత మరో సినిమా కూడా రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీతో కలిసి రామ్‌చరణ్ ఓ సినిమా చేయబోతున్నట్టు ఈ మధ్య వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఈ విషయమై రాజ్‌కుమార్ హిరానీ తాజాగా క్లారిటీ ఇచ్చారు. ఇటీవల ఓ ఆన్‌లైన్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన రామ్ చరణ్‌తో ప్రస్తుతానికి ఏ సినిమా ప్లాన్ చేయట్లేదని స్పష్టం చేశారు. అయితే, రామ్‌చరణ్ తనకు తెలుసునని, అవకాశాన్ని బట్టి చరణ్‌తో సినిమా చేస్తానని తెలిపారు. ఆర్ఆర్ఆర్‌లో రామ్‌చరణ్ అద్భుతంగా చేశాడని కూడా కితాబునిచ్చారు..!!

Rakul Preet Singh And Jackky Bhagnani To Get Married?

Nayanthara To Work With Mythri Movie Makers!