in

RAJINIKANTH’S ANNAATTHE TO RELEASE IN RECORD NUMBER OF THEATRES ABROAD!

సూపర్ స్టార్ రజినీకాంత్ అభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా “అన్నాతే”. శివ దర్శకత్వంలో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా కీర్తి సురేష్ రజనీకాంత్ చెల్లెలి పాత్రలో కనిపించబోతున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకి భారీ ఓపెనింగ్స్ లభించనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాని గ్రాండ్గా థియేటర్లలో విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ఫిక్స్ అయ్యారు.

కేవలం అమెరికా, మలేషియా, సింగపూర్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా మరియు యూ కే లో ఈ సినిమా ఒక 1100 థియేటర్లలో విడుదల కాబోతుంది. ఇప్పటిదాకా ఏ తమిళ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా ఇంత భారీ ఓపెనింగ్స్ లభించలేదు. ఇందులో కేవలం అమెరికాలోనే ఐదు వందల కంటే ఎక్కువ స్క్రీన్స్ లో విడుదల కాబోతోంది ఈ సినిమా. ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా స్క్రీన్ అయిన పానాసోనిక్ ఐమాక్స్ థియేటర్ సిడ్నీలోని డార్లింగ్ హార్బర్ లో ఉంది. అందులో కూడా ఈ సినిమా విడుదల కాబోతోంది.

Shruti Haasan, Bhavana to Star in balakrishna’s next!

popular Anchor Suma to act in films again!