
74 సంవత్సరాల వయసులో కూడా సూపర్ స్టార్‌గా తమ అభిమానులను అలరిస్తున్న రజనీకాంత్, నటనకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. రజనీకాంత్‌కు ఇప్పుడు 74 ఏళ్లు. ఈ వయస్సులో చురుగ్గా సినిమాలు చేస్తున్నప్పటికీ, తన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ నిర్ణయాన్ని తన కుటుంబ సభ్యులు, సన్నిహితులతో చర్చించిన తర్వాతే తీసుకున్నారని తెలుస్తోంది..
2027 సంవత్సరం చివరి నాటికి ఆయన సినిమా రంగానికి గుడ్‌బై చెప్పే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. రజనీకాంత్‌కు మాస్ సినిమాలు చేయడమంటే చాలా ఇష్టం. అభిమానులు కూడా ఆయన నుంచి అదే తరహా యాక్షన్ సినిమాలను ఆశిస్తారు. రజనీకాంత్ ఎప్పుడూ యాక్షన్ సన్నివేశాలలో చురుగ్గా పాల్గొనడానికి ఇష్టపడతారు. అయితే, వయసు పెరగడం వల్ల మునపటిలా యాక్షన్ చేయడం సాధ్యం కావడం లేదు..!!

