in

Rajinikanth heads to himalayas after a 4 years gap!

ఇంకో ఇరవై నాలుగు గంటల్లో ప్రీమియర్లు మొదలవుతాయనగా రజనీకాంత్ హిమాలయాలకు వెళ్లిపోయారు. తరచుగా ఈ పర్యటన ఆయనకు అలవాటే అయినా ఇటీవలి కాలంలో ఆరోగ్యం దృష్ట్యా ఎక్కువగా వెళ్ళలేదు. నాలుగేళ్లకు పైగా గ్యాప్ వచ్చిందట. అందుకే ప్రశాంతత కోసం కొన్ని రోజులు అక్కడ గడిపి వస్తారట. ఈలోగా జైలర్ ఇక్కడ ఫైనల్ రన్ పూర్తి చేసుకుని రికార్డుల లెక్క తేల్చేసి ఉంటుంది. ఇటీవలే చెన్నైలో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రజని ఇచ్చిన గంటన్నర స్పీచ్ తాలూకు వీడియోలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఆయన సంగతేమో కానీ అన్ని భాషల్లో జైలర్ కు మంచి బజ్ కనిపిస్తోంది..ట్రైలర్ కట్ తో పాటు అనిరుద్ పాటలు జనాన్ని ఆకట్టుకుంటున్నాయి. హైదరాబాద్ లాంటి నగరాల్లో భోళా శంకర్ కంటే రజనికే మంచి బుకింగ్స్ ఉండటం షాక్ కలిగిస్తోంది. రోబో తర్వాత మళ్ళీ యునానిమస్ అనిపించుకున్న అంత పెద్ద సక్సెస్ అందుకోలేకపోయిన తలైవర్ కి జైలర్ బ్లాక్ బస్టర్ కావడం చాలా కీలకం. దీని తర్వాత కూతురు దర్శకత్వంలో క్యామియో చేసిన లాల్ సలాం రిలీజ్ ఉంటుంది..!!

Alia Bhatt teaching Telugu to hollywood star Gal Gadot!

vijay devarakonda responds on clash with anchor anasuya!