కొన్ని రోజుల నుంచి అయితే అందరి చూపులు రజిని వైపే ఉన్నాయి.. కానీ ఇప్పుడు ఎట్టకేలకు మాత్రం ఆ బిగ్ డే ఎప్పుడో అనౌన్స్ చేసేసి ఒక్క తమిళనాట రాజకీయాల్లోనే కాకుండా దేశవాళీ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా నిలిచారు. ఇంతకీ తన కొత్త పార్టీను ఎపుడు ప్రకటించనున్నారంటే ఈ ఏడాది ముగింపు డిసెంబర్ 31న తన కొత్త పార్టీకు అధికారికంగా ప్రకటించి..కొత్త సంవత్సరం ఆరంభంతో పురుడు పోయనున్నారు. ఈ ప్రకటన కోసమే ఎంతో కాలం నుంచి చాలా మంది ఎదురు చూస్తున్నారు. మొత్తానికి మాత్రం తలైవర్ ఆ భారీ ప్రకటనను ఫైనల్ చేసేసారు. ఇప్పటికే అక్కడ విశ్వ నటుడు కమల్ హాసన్ కూడా పార్టీ పెట్టిన సంగతి తెలిసిందే. మరి రజిని పార్టీ విధి విధానాలు వారి పార్టీ పేరేంటో తెలియాలి అంటే అప్పటి వరకు ఆగాల్సిందే.