లెజెండరీ దర్శకులు మణిరత్నం, సూపర్ స్టార్ రజనీకాంత్ ని మరోసారి కలిసేలా చేస్తోందని చెన్నై టాక్. ఈ ఇద్దరి కలయికలో వచ్చిన ఒకే ఒక సినిమా దళపతి. 1991లో మహాభారతంలో కర్ణుడు దుర్యోధనుడు పాత్రలను తీసుకుని ఈ క్లాసిక్ ని తీర్చిదిద్దిన తీరు భారీ వసూళ్లనే కాదు దశాబ్దాలు గడిచే కొద్దీ దాని కల్ట్ స్టేటస్ ని పెంచుకుంటూ పోతూనే ఉంది. ఇప్పటికే ఇళయరాజా బెస్ట్ ఆల్బమ్స్ దళపతిని ఒకటిగా చెప్పాల్సిందే.
ఇదంతా జరిగి 30 ఏళ్ళు దాటేసింది. పొన్నియన్ సెల్వన్ 2 తాలూకు పనులు మొత్తం పూర్తయ్యి 2023 వేసవిలో రిలీజ్ చేశాక రజనితో తో మణిరత్నం సినిమా మొదలుపెట్టబోతున్నట్టు తెలిసింది. పిఎస్ 1 & 2 లాగా ఇదేమి రాజవైభవానికి సంబంధించిన కథ కాదుట. జీవితంలో ఉన్నతం పతనం అన్నీ చూసేసిన ఒక మనిషి ఎమోషనల్ జర్నీని తనదైన శైలిలో నాయకుడు ఫార్మట్ లో తీయబోతున్నట్టు వినికిడి. ఇప్పటికే ఈ కాంబో సాధ్యం కావడం గురించి విశ్వసనీయ తమిళ మీడియా వర్గాల్లో చర్చ జరుగుతోంది..!!