లోకేష్ కనకరాజ్..రజనీకాంత్ కు కూలి సినిమాతో బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఆయన గతంలో విక్రమ్ సినిమాతో కమలహాసన్ కూడా అదిరిపోయే బ్లాక్ హిట్ ఇచ్చాడు. ఈ క్రమంలోనే థలైవార్, లోకనాయకుడు ఇద్దరినీ కలిపి ఓ బిగెస్ట్ మల్టీ స్టారర్‌కు రంగం సిద్ధం చేసినట్లు టాక్ నడుస్తుంది. ఇక వీళ్లిద్దరి కాంబోలో సినిమా వచ్చి దాదాపు 40 ఏళ్లు గడిచిపోతుంది. ఈ క్రమంలోనే.. వీళ్లిద్దరి కాంబో సినిమాపై ఆడియన్స్‌లో మంచి హైప్ నెలకొంది..
వాస్తవానికి రజినీ సినీ కెరీర్ ప్రారంభమైంది కమల్ సినిమాతో. కమలహాసన్ నటించిన అపూర్వరాగంగళ్ మూవీలో కమల్‌హాసన్ హీరోగా నటించిన సినిమాలో రజినీకాంత్ కీలక పాత్రలో మెరుసారు. ఈ సినిమా తర్వాత వీళ్ళిద్దరూ కలిసి దాదాపు డజన్‌కు పైగా సినిమాల్లో ఆకట్టుకున్నారు. తమిళ్ ఇండస్ట్రీలో ప్రాణ స్నేహితులుగా పేరు సంపాదించుకున్నారు. బాలీవుడ్ అమితాబ్ హీరోగా తెరకెక్కిన గిరాఫ్తార్ సినిమాలో వీళ్ళిద్దరూ చివరిసారిగా కలిసి మెరిసారు. ఈ క్రమంలోనే వీళ్లిద్దరు కాంబోలో సినిమా వస్తుందంటూ న్యూస్ తెగ వైరల్ అవుతుంది.!!