in

Rajinikanth and Balakrishna, 50 Years of cinema Honored at IFFI

మిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌, నటసింహం బాలకృష్ణలకు అరుదైన గౌరవం దక్కింది. ఈ ఏడాది గోవా వేదికగా జరగనున్న 56వ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా (ఇఫి – 2025) వేడుకల్లో వీరిద్దరూ ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నారు. ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ వేడుకల్లో ‘రజని – బాలయ్య’లమును సన్మానించబోతున్నారు. ఈ విషయాన్ని కేంద్ర సమాచార ప్రసారశాఖ సహాయ మంత్రి ఎల్‌.మురుగన్‌ తాజాగా వెల్లడించడం విశేషం.

గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ సమక్షంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎల్‌.మురుగన్‌ మాట్లాడుతూ.. ‘సినీ ప్రయాణంలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రజనీకాంత్‌ గారిని, బాలకృష్ణ గారిని సన్మానించబోతున్నాం. ఇది భారతీయ సినిమా రంగంలోనే ఒక మైలురాయి అని చెప్పొచ్చు. అందుకే, వారి కృషికి గుర్తింపుగా ఇఫి ముగింపు వేడుకల్లో వారిని సన్మానించనున్నాం’’ అని ఎల్‌.మురుగన్‌ చెప్పుకొచ్చారు. సినీ రంగం ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా’ (ఇఫి) అవార్డుల వేడుక నవంబర్‌ 20 నుంచి 28 వరకూ గోవా వేదికగా జరగబోతుంది..!!

trisha: Stop Marrying Me Off to Every Star i click photo