in

rajendra prasad: i did not Insult Allu Arjun, he is like my son!

టాలీవుడ్ లో స్టార్ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తిరుగులేని ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్..తాజాగా తన సినిమా ప్రమోషన్స్ లో మాట్లాడుతూ కొన్ని సెన్సేషనల్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆయన ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన హ‌రిక‌థ బెబ్‌సిరీస్ ప్ర‌మోష‌న్‌లో మాట్లాడుతూ..చందనం దుంగల దొంగ.. వాడొక హీరో అంటూ చేసిన కామెంట్స్ ఇటీవల హాట్‌ టాపిక్‌గా తెగ ట్రెండ్ అయ్యాయి.

ఈ క్రమంలో బన్నీని ఉద్దేశించే రాజేంద్రప్రసాద్ అలాంటి కామెంట్స్ చేశారంటూ..పుష్ప 2 సినిమాపై ఆయన సెన్సేషనల్ కామెంట్స్ చేశారంటూ వార్తలు తెగ వైరల్ గా అయ్యాయి. దీంతో నెట్టింట చర్చినీయంశంగా..ఓ వివాదంగా మారింది. ఇంకా గొడవ ముదర‌క‌ముందే దీనిపై క్లారిటీ ఇవ్వాలని నిర్ణయించుకున్న రాజేంద్రప్రసాద్..తాజాగా దీనిపై రియాక్ట్ అవుతూ నేను అల్లు అర్జున్‌ను ఉద్దేశించి ఆ కామెంట్స్ చేయలేదని వెల్లడించాడు. బన్నీ నా కొడుకు లాంటివాడు. అతన్ని అలా నేను ఎందుకు అంటాను.. బ‌న్నీ నువ్వు నా బంగారం..లవ్ యు అంటూ రాజేంద్రప్రసాద్ వెళ్లడించాడు.

Pawan Kalyan Is 2nd Most Searched Indian On Google Worldwide!