రాబిన్ హుడ్, భారీ అంచనాలతో ముందుకు వెళుతోంది. దీంతో మేకర్స్ ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నటీనటులతో పాటు సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్, క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా హాజరయ్యారు. అయితే, ఈ వేడుకలో రాజేంద్రప్రసాద్ చేసిన కొన్ని వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. ఈ దొంగ ము కొడుకు.. వీడు మామూలోడు కాదండిఅంటూ వార్నర్ గురించి చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చాయి..
రాజేంద్రప్రసాద్ తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు. ఐ లవ్ వార్నర్ ఐ లవ్ క్రికెట్ వార్నర్ మా సినిమాలను, నటనను ఇష్టపడతాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అనుకోకుండా నోటి నుంచి మాటలు వచ్చిపోయాయి. ఉద్దేశపూర్వకంగా మాట్లాడలేదు. వార్నర్ పై అనుకోకుండా నోటి నుంచి మాట దొర్లింది. అది ఉద్దేశ్య పూర్వకంగా మాట్లాడింది కాదు. మేమంతా ఒకరికొకరం క్లోజ్ అయిపోయాం. తన వ్యాఖ్యల వల్ల ఎవరైనా బాధపడితే క్షమించండి అంటూ తెలిపారు..!!