శ్రీకాంత్ ను హీరో క్యారెక్టర్ కి సెలెక్ట్ చేసి ఆ తరువాత ఆయన స్థానంలో రాజశేఖర్ ని తీసుకున్న నిర్మాత. షారుఖ్ ఖాన్ నటించిన సూపర్ డూపర్ హిట్ మూవీ “బాజిగర్” ని “వేటగాడు” పేరుతో తెలుగులో రీమేక్ చూస్తూ మొదట శ్రీకాంత్ ను హీరో అనుకున్నారు, ఆయన ప్రక్కన సౌందర్య, రంభ హీరోయిన్ లు అనగానే యెగిరి గంతేశారు శ్రీకాంత్. కానీ మనం ఒకటి తలిస్తే, విధి ఇంకొకటి నిర్ణయిస్తుంది అన్నట్లు, కారణాలు తెలియదు కానీ శ్రీకాంత్ స్థానం లో రాజశేఖర్ ని హీరో గ తీసుకున్నారు, అదే చిత్రంలో ఒక చిన్న క్యారెక్టర్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది శ్రీకాంత్ గారు. ఆ తరువాతి కాలం లో ” ఆమె”, ” తాజ్ మహల్ ” వంటి చిత్రాలు హిట్ కావటం,” పెళ్లి సందడి ” సూపర్ హిట్ అవ్వటం తో శ్రీకాంత్ కెరీర్ లో సందడి మొదలయింది,
ఆమె చిత్రంతో ఆయనకు ఇంటామె(ఊహ) దొరికింది, “పెళ్లి సందడి” తో మొదలైన సందడి ఒక దశలో ఏడాదికి 13 సినిమాలు రిలీజ్ చేసే స్థాయికి చేరింది. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమలో ఎంటర్ అయిన వారికీ కెరీర్ ప్రారంభ దశలో ఇటువంటి చేదు అనుభవాలు సర్వ సాధారణం, అటువంటి అనుభవాలు ఎదురైనపుడు, నిరాశ, నిస్పృహలకు లోను కాకుండా తన ప్రయత్నం కొనసాగించి, తాను అనుకున్నది సాధించారు శ్రీకాంత్ గారు.విలన్ గ కెరీర్ ప్రారంభించి, హీరోగా పరిణితి చెంది, కాలానుగుణంగా మళ్ళీ విలన్ గ కొనసాగుతూ, నటుడికి నటనే ముఖ్యం ట్యాగ్లు కాదు అని నిరూపించారు శ్రీకాంత్ గారు.