మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ఇద్దరు కాంబినేషన్లో సినిమా వస్తుందని తప్ప..ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ బయటకు రాలేదు. మూవీ యూనిట్ అధికారికంగా ఈ సినిమా గురించి ఇప్పటి వరకు ఏమీ చెప్పలేదు. ఇటీవల మూవీ ఓపెనింగ్ జరిగినప్పటికీ అది కూడా సీక్రెట్ గానే పూర్తి చేశారు. దానికి సంబంధించిన ఒక్క ఫోటో కానీ, వీడియో కానీ బయటకు రాలేదు. కానీ నిత్యం ఈ సినిమాకు సంబంధించిన ఏదో ఒక వార్త మాత్రం వైరల్ అవుతూనే ఉంది.
తాజా సమాచారం ప్రకారం..సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోందని తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ జాన్ అబ్రహంతో షూటింగ్ చేస్తున్నారని సమాచారం. ఈ సినిమాలో జాన్ అబ్రహం కూడా కీలక పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా గురించి ఎప్పుడూ ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవడం తప్ప..చిత్ర బృందం సినిమాకు సంబంధించి ఎలాంటి సమాచారం ఇవ్వట్లేదు. దీంతో ఫ్యాన్స్ నిరాశ చెందుతూ సోషల్ మీడియాలో మహేష్ బాబుకు, రాజమౌళికి ప్రశ్నలు సంధిస్తూనే ఉన్నారు..!!