
డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి అత్యంత విజయవంతమయిన డైరెక్టర్ ,తన ఖాతా లో ఒక్క ఫెయిల్యూర్ కూడా లేని డైరెక్టర్. బాహుబలి చిత్రం తో రాజమౌళి గ ప్రపంచ వ్యాప్త గుర్తింపు, గౌరవం దక్కించుకున్న ఈ మెగా డైరెక్టర్ కి ఇంకొక పేరు ఉన్నది, అదేమిటంటే “జక్కన్న” ఈ పేరు తో అయన తో సన్నిహితం గ ఉండే వారు ముద్దుగా పిలుచుకుంటారు అనే విషయం చాలామందికి తెలిసి ఉండవచ్చు. కానీ, ఈ పేరు ఎందుకు, ఎవరు, ఎప్పుడు పెట్టారు అనే విషయం ఎంతమందికి తెలుసు? తెలుసుకోవాలనుకొంటే, చెప్పబోయే విషయం చదివితే మీకే తెలుస్తుంది.రాజమౌళి గారు డైరెక్టర్ గ తన కెరీర్ ను ఒక టి.వి.సీరియల్ తో ప్రారంభించారు, కే.రాఘవేంద్ర రావు గారు నిర్మించిన, ” శాంతినివాసం ” అనే సీరియల్ రాజమౌళి గారి మొదటి ప్రాజెక్ట్.అందులో అప్పటికే బుల్లి తెర మీద పాపులర్ అయిన రాజీవ్ కనకాల గారిని నెగటివ్ క్యారెక్టర్ కి సెలెక్ట్ చేసుకున్నారు. షూటింగ్ స్టార్ట్ అయింది తన సీన్స్ షూటింగ్ ఉన్న రోజు, రాజీవ్ గారు ఉదయం 6 గంటలకు స్పాట్ కు వెళ్లారు, అప్పటికే రాజమౌళి గారు హీరోయిన్ కి సంబంధించిన షాట్స్ తీస్తున్నారు, తీసిన షాట్ మళ్ళీ, మళ్ళీ, తీస్తూ ఉన్నారట, 10 గంటలయినా రాజీవ్ కి పిలుపు లేదు, అప్పుడు రాజీవ్ గారు పక్కనున్న వాళ్ళ తో సరదాగా అన్నారట,ఎవరయ్యా బాబు అమర శిల్పి జక్కన్న లాగా చెక్కుతున్నాడు అని. ఈ సీరియల్ పూర్తి అయ్యే లోపు రాజీవ్ గారికి, రాజమౌళి గారికి సాన్నిహిత్యం పెరగటం, సరదాగా ఉండే రాజీవ్ గారు ఆయనకు జక్కన్న అనే పేరు ఫిక్స్ చేసేసారు.అయన ఒక శిల్పి లాగా చిత్రాలను మలచటం వలనే ఆయనకు ఓటమి అన్నదే తెలియకుండా ముందుకు సాగుతున్నారు. వారికి “జక్కన్న” అనేది సరైన పేరు, ఒక రకంగా అది ఆయనకు, ఆయనను ప్రేమించే వారు ఇచ్చిన “బిరుదు” అనుకోవాలి.

