ప్రభాకర్..ఈ పేరు చాల మందికి తేలికపోవచ్చు కానీ అతడు చేసిన కాలకేయ పాత్రా మాత్రం ప్రపంచం అంత గుర్తుపెట్టుకుంటుంది..అంతలా ఆ పాత్రా బాహుబలి సినిమాలో ఇంపాక్ట్ క్రియేట్ చేసింది..ఈయన గురించి చాల మందికి తెలీదు..తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ ఆర్టికల్ మొతం చదవండి.. ప్రభాకర్ ది కరువు జిల్లా అయిన మహబూబ్ నగర్ లోని హస్నాబాద్ గ్రామం. ఇతడు సినిమాల్లో నటించాలని అస్సలు అనుకోలేదట.. పరిస్థితులే ఆయనను నటనవైపు తీసుకెళ్లాయి. రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తానంటే హైదరాబాద్ వచ్చి మోసపోయిన ప్రభాకర్ పొట్ట నింపుకోవడానికి చేయని పనంటూ లేదట.. కూలీనాలీ సహా అన్ని పనులు చేశాడు. ఓ రోజు మహేష్ బాబు హీరోగా జరుగుతున్న ‘అతిథి’ సినిమా షూటింగ్ చూడడానికి ప్రభాకర్ వచ్చాడు. ఓడ్డు పొడువు.. విలన్ లా కనిపించడంతో సెలెక్ట్ అయ్యి అందులో చిన్న పాత్ర చేశాడు. అనంతరం రాజమౌళి దృష్టిలో పడి ఫేమస్ అయ్యాడు.
సినిమాల్లోకి రాకుముందు చాలా అప్పులు చేశాడట ప్రభాకర్.. అవన్నీ ‘మర్యాద రామన్న’ సినిమాలో నటించాక వచ్చిన రెమ్యునరేషన్ తో తీర్చేశాడట.. ఇక నటన ఏమాత్రం రాకున్నా రాజమౌళియే ప్రభాకర్ ను సానబట్టి తీర్చిదిద్దాడట.. ప్రముఖ నటులు దేవదాస్ కనకాల దగ్గర శిక్షణ ఇప్పించి మరీ రాటు దేలేలా చేశాడట… నెలకు 10వేల స్టైఫండ్ ఇప్పించి మరీ రాజమౌళి తనకు నటనలో ఓనమాలు నేర్పారని.. తన పడ్డ కష్టాలన్నీ రాజమౌళి దయవల్లే తీరాయని చెప్పుకొచ్చాడు. తాను రాజమౌళి వల్లే ఈ రేంజ్ కు చేరుకున్నానని.. జక్కన్నే తనకు గాడ్ ఫాదర్ అని కాలకేయ ప్రభాకర్ వినమ్రంగా చెబుతున్నాడు.