రాజమౌళి తాజాగా ‘జూనియర్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. గాలి జనార్దన్ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి ఈ చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నారు. శ్రీలీల ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీ ఈ నెల 18న గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ క్రమంలో బుధవారం చిత్ర బృందం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది..
ఈ ఈవెంట్లోనే జక్కన్న పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. యాంకర్ సుమ, రాజమౌళి తెరకెక్కించిన సినిమా పోస్టర్లు, షూటింగ్ కు సంబంధించిన ఫొటోలను స్క్రీన్ పై చూపిస్తూ వాటి గురించి అడిగారు. ఈ క్రమంలోనే ఈగ సినిమాకు సంబంధించిన ఫొటో ఒకటి వేయగానే, దానికి రాజమౌళి వెంటనే ‘ఇది ఈగ సినిమాకు సంబంధించింది. నా బెస్ట్ మూవీ అది’ అని చెప్పారు. దీంతో రాజమౌళి తీసిన చిత్రాల్లో తనకు ఈగ బెస్ట్ అని తెలిసిపోయింది..!!