బాహుబలి, ఆర్‌ఆర్ఆర్ లాంటి సినిమాలు ప్రపంచ నలుమూలల పేరును గడించిన సంగతి తెలిసిందే. దీంతో తెలుగు సినిమా ఖ్యాతి ప్రపంచానికి చాటాడు రాజమౌళి. ఇక ఆర్‌ఆర్ఆర్ సినిమా ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ అవార్డులు కూడా దక్కించుకుంది. ఆస్కార్ అవార్డు అందుకున్న మొదటి భారతీయ సినిమాగా రికార్డ్ సృష్టించింది.
ఈ సినిమా తర్వాత చరణ్, ఎన్టీఆర్ లకు ఆస్కార్ అకాడమీ కొత్త సభ్యులుగా ఆహ్వాని గతంలో అందించిన సంగతి తెలిసిందే. అదేవిధంగా తాజాగా రాజమౌళి ఆయన సతీమణి రామా రాజమౌళిలకు కూడా ఆస్కార్ అకాడమీలో కొత్త సభ్యులుగా ఆహ్వానాన్ని అందించింది. దీంతో రాజమౌళికి ఇది నిజమైన ప్రైడ్ మూమెంట్గా నిలవనుంది. తాజాగా 487 మంది కొత్త సభ్యుల జాబితాను మోషన్ పిక్చర్స్ అండ్ సైన్స్ కేటగిరి లో తయారు చేయగా వీరి పేర్లలో రాజమౌళి, రామ రాజమౌళి కూడా స్థానాన్ని దక్కించుకోవడం విశేషం..!!